Friday, July 4, 2025

ఐటీ..పిటీ

- Advertisement -
- Advertisement -

 మైక్రోసాఫ్ట్, ఇంటెల్, ఐబిఎం
లే ఆఫ్‌లు మూడేళ్లుగా
కోలుకోలేని దుస్థితి యువ
తరం అమెరికా ఆశలపై నీళ్లు

న్యూయార్క్ :టెక్ రంగాన్ని ఇప్పటికీ తీవ్రస్థా యి సంక్షోభం వెంటాడుతోంది. మైక్రోసాఫ్ట్, ఐ బిఎం,ఇంటెల్ వంటి దిగ్గజ కంపెనీలలో లే ఆఫ్‌ల పర్వం సాగుతోంది. ఈ ప్రధానమైన మూడు సంస్థలలో కలిపితే ఈ ఏడాది ఇప్పటి కే లక్ష ఉద్యోగాలకు కోత పడింది. దీనితో ఐటి విద్యాధికులు ఈ మేరకు రోడ్లపై పడాల్సి వ చ్చింది. వేరే ఉద్యోగాల వేటలో సాగాల్సి వ స్తోంది. ప్రత్యేకించి ఈ కీలక చేదు పరిణామం ఇప్పుడు యువతరం అమెరికా డాలర్ ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. వేతనాలలో కోతలు, ఉద్యోగాలతీసివేతలతో సంస్థలు తమ ఆర్థిక దిద్దుబాట్లకు దిగుతున్నాయి. వ్యయ అంచనాలు పెరగడం, భారీ వేతనాలు చెల్లించలేని క టకట మధ్య ఐటి దిగ్గజ కంపెనీలు పలు చర్యలకు దిగుతున్నాయి. అయితే తమ లక్షాల సాధన అనివార్యం కావడంతో కృత్రిమ మేథ (ఎఐ) పరిజ్ఞానం వైపు సాగుతున్నాయి.

మైక్రోసాఫ్ట్‌లో పది వేల మందిపై వేటు
మైక్రోసాఫ్ట్ ఇప్పటికే దాదాపు పదివేల మందిని ఉద్యోగాల నుంచి తొలిగించింది. ఎక్స్‌బాక్స్, గేమింగ్ యూనిట్లలో కోతలు ఎక్కువ అయ్యా యి.ఇంటెల్ ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో 20శాతం మేర తమ ఉద్యోగ శక్తిని తగ్గించుకుంది. ఈ స్థాయిలో ఇప్పుడు ఇంటెల్ ఉద్యోగాలు పోగొట్టుకున్న వారు తిరిగి ఉద్యోగాల ని రీక్షణలో పడ్డారు. మొత్తం మీద లక్ష వరకూ ఉ ద్యోగాలు హుళక్కి అయ్యాయి. మొత్తం మీద 2025 ఈపాటికే ఐటి నిపుణుల మెడపై కత్తి బాపతుగా మారింది. ఇది తమకు మరో బ్రూ టల్ ఇయర్ అని ఐటివాలాలు వాపోతున్నారు. ఇంటెల్, మెటా, గూగుల్ తమ కోతలతో ముందుకు సాగుతున్నాయి. కంపెనీలను నిర్వహించడానికి తాము తప్పనిసరిగా సరికొత్త ఆర్థిక పంథాలను ఎంచుకోవల్సి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

కంపెనీలు మూతపడకుండా చేసుకునేందుకు పునర్నిర్మాణ చర్యలకు దిగారు. ఇందుకు ఎక్కువగా ఎఐను ఆధారం చేసుకుంటున్నారు. మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగుల్లో 4 శాతం మంది వరకూ లే ఆఫ్‌ల ఊబిలో చిక్కారు. తమ సంస్థలో కొన్ని విభాగాలలో ఉద్యోగాలకు కోత అవసరం అయిందని నిర్వాహకులు తెలిపారు. కాంబడీ క్రష్ తెరవెనుక ఉన్న కింగ్ స్టూడియో నుంచి 200 మందిని తీసేశారు. ఐటి కంపెనీల్లో ఉద్యోగాల కోతల గురించి బ్లూమ్‌బెర్గ్ కథనం వెలువరించింది. ఇంటెల్‌లో ఎక్కువగా చిప్స్ టీమ్స్‌పై కోతలు పడ్డాయి. 20శాతం వరకూ వేతన తగ్గింపులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ సంస్థ కొత్త సిఇఒ లిప్ బూ టన్ సారధ్యంలో సాగుతోంది. జులైలో శాంతా క్లారాలోని ప్రధాన కార్యాలయంలో పనిచేసే 107 మంది ఉద్యోగులను తీసేశారు. జర్మనీలోని తమ ఆటోమోటివ్ చిప్ యూనిట్‌ను కూడా మూసివేస్తున్నారు. తప్పనిసరిగా కొన్ని చర్యలకు పాల్పడాల్సి వస్తోందని నూతన నిర్వాహకులు తమ అశక్తతను చాటారు. ఉద్యోగాల తీసివేత సంస్థ ఉనికికి తప్పనిసరి అని సమర్థించుకున్నారు.

అమెజాన్‌లో బుక్ డివిజన్‌లో కోతలు
అమెజాన్ సంస్థలో ఇప్పటికే నాలుగుసార్లు ఉద్యోగులపై వేటు వేశారు. ప్రత్యేకించి బుక్ డివిజన్‌లో భారీ స్థాయి ఉద్యోగాల తీసివేతలు జరిగాయి. పలు ఇతర విభాగాలలో కూడా ప్రభావం పడింది. ఐబిఎంలో వేలాది మందిని తీసివేశారు. సాధారణ ఉద్యోగులు చేసే బాధ్యతలను ఈ సంస్థ ఎఐ పరిజ్ఞానంతో నిర్వహిస్తోంది. అవసరం అయితే ఎఐని మరింత విస్తృతపరుస్తామని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇన్ఫోసిస్ , గూగుల్ ఇతర కంపెనీలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. టిక్‌టాక్ వర్క్ ఫోర్స్‌ను కుదించారు. మెటాకు చెందిన రియాల్టీ లాబ్స్ డివిజన్‌లో కోతలు వాతలు పడ్డాయి. 2023, 2024లో ఆరంభమైన లే ఆఫ్‌లు ఈ ఏడాది మరింత పెరిగినట్లు రికార్డులు తెలిపాయి.

అయితే కొన్ని సంస్థలు విరివిగా ఎఐను వాడుకునేందుకు మానవ శక్తిని దూరం పెడుతున్నట్లు విశ్లేషణల్లో వెల్లడైంది. ఇది భవిష్యత్తులో యువ ఐటిలకు అత్యంత ప్రమాదకర పరిణామం కానుంది. పైగా చలో అమెరికా అనుకునే వారికి ఇక ఎటూ పోలేని స్థితికి దారితీస్తోంది. ఐబిఎంలో ఎనిమిది వేల మంది ఉద్యోగాలు పొయ్యాయి. ఈ వరుసలోనే ఒలా ఎలక్ట్రిక్ , హెచ్‌పిలలో కూడా జాబ్స్‌పై వేటు పడింది. వర్డ్‌ప్రెస్‌ను నిర్వహించే ఆటోమాటిక్స్ సంస్‌థ ఇప్పటికే 16 శాతం మందిపై వేటేసింది. దీనితో 300 మంది వరకూ ఇంటిబాట పట్టారు. ప్రత్యేకించి గూగుల్‌లో కూడా కోతలతో ఐటి నిపుణులు ఆందోళన చెందుతున్నారు. తమ ప్లాట్‌ఫామ్స్ , డివైసెస్ డివిజన్లలో ఉద్యోగులను తీసివేశారు. ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్ వంటివాటిని ఈ విభాగాలు పర్యవేక్షిస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News