Friday, July 11, 2025

కెనడాలో శిక్షణ విమానాలు ఢీ.. భారతీయ యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

కెనడాలో శిక్షణ విమానాలు ఢీకొన్న ఘటనలో ఓ భారతీయ శిక్షక పైలట్ సహా ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ఘటన మనిటోబా ప్రాంతంలో జరిగింది. భారతీయ ట్రైనీ పైలట్ మృతి చెందిన విషయాన్ని టొరంటో లోని బారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. భారతీయుడిని శ్రీహరి సుఖేష్ అని గుర్తించారు.ఈ యువకుడి పూర్వీకులు కేరళకు చెందిన వారు. సింగిల్ సీటు శిక్షణ విమానాలు రెండు ఆకాశంలో ఢీకొన్నాయి.

మరో విమాన ట్రైనీ పైలట్ కెనడా జాతీయుడు అని వెల్లడైంది. ఇద్దరు ట్రైనీ పైలట్ల మృతదేహాలను విమానాల శిధిలాల కిందనుంచి బయటకు తీశారని, వారి సమీప బంధువులకు అప్పగించేందుకు ఏర్పాట్లు జరిగాయని కెనడియన్ వార్తా ప్రసార సంస్థ (సిబిసి) తెలిపింది. విమానం ల్యాండింగ్, టేకాఫ్‌ల శిక్షణ దశలోనే ఈ ఇద్దరు ట్రైనీ పైలట్లు మృతి చెందారని వెల్లడైంది. రెండు విమానాలు 400 మీటర్ల ఎత్తులోనే ఢీకొన్నాయని శిక్షణ సంస్థ నిర్వాహకులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News