తాను హిందీలోనో, భోజ్ పురీ లోనే మాట్లాడడతానని ముంబై లోని విరార్ రైల్వే స్టేషన్ వద్ద వాదించిన ఆటో డ్రైవర్ ని శివసేన (యుబిటి) ఎంఎన్‌ఎస్ కార్యకర్తలు చితకబాదారు. కొద్ది రోజుల క్రితం విరార్ స్టేషన్ వద్ద ఉత్తరప్రదేశ్ కు చెందిన వలస వచ్చిన ఆటో డ్రైవర్ కు భవేష్ పడోలియా అనే వ్యక్తికి భాష విషయంలో తలెత్తిన వివాదం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరాఠీలో ఎందుకు మాట్లాడటం లేదని అడిగినప్పుడు ఆ ఆటో డ్రైవర్ మై హిందూ బోలుంగా (నేను హిందీలో మాట్లాడతా) అని పదేపదే అనడం వీడియోలో కనిపించింది.శనివారం విరార్ రైల్వే స్టేషన్ వద్ద
ఆ ఆటోడ్రైవర్ ను చూసిన శివసేన (యుబిటి) ఎంఎన్ ఎస్ మద్దతు దారుల అతడిని చెంపదెబ్బలు కొట్టారు.కొట్టిన వారిలో మహిళా సభ్యులు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఆటో డ్రైవర్ బహిరంగంగా భవేష్ పడోలియా అనే వ్యక్తికి, అతడి సోదరికి, మహారాష్ట్ర రాష్ట్రానికీ క్షమాపణ చెప్పాడు. మారాఠీలో మాట్లాడని అనడం మరాఠీ భాషను, మహారాష్ట్ర సాంసృ్కతిక వైభవాన్ని అవమాన పరచడమే అని దాడిచేసిన వారు పేర్కొన్నారు. మరాఠీ భాషను కానీ, మరాఠీ సంసృ్కతిని కానీ, మహారాష్ట్ర ను కానీ అవమానించిన పక్షంలో శివసేన తన దైన భాషలో బుద్ధిం చెబుతుందని శివసేన విరార్ సిటీ చీఫ్ ఉదయ్ జాధవ్ పేర్కొన్నారు