Saturday, August 2, 2025

సరదాగా సాగే ‘ప్లీజ్ మేమ్…’

- Advertisement -
- Advertisement -

హీరో నారా రోహిత్ తన మైల్ స్టోన్ 20వ మూవీ ’సుందరకాండ’ (Sundarakanda) తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ ప్లీజ్ మేమ్… సాంగ్‌ని రిలీజ్ చేశారు. ప్లీజ్  మేమ్ సాంగ్ మోడ్రన్ బీట్‌లతో పాటు తెలుగుదనం కూడా మిక్స్ (Telugu also mix) అయి క్యాచీ, క్రేజీగా వుంది. శ్రీహర్ష ఇమాని రాసిన లిరిక్స్ ఫన్‌ఫుల్‌గా పాటకి సెట్ అయ్యాయి. వీడియోలో హీరో తన ఫ్రెండ్స్‌తో కలిసి శ్రీదేవిని ఆకట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు సరదాగా వున్నాయి. నారా రోహిత్, – శ్రీదేవి విజయ్ కుమార్ కెమిస్ట్రీ బ్యూటీఫుల్‌గా వుంది. గణేష్ చతుర్థి సందర్భంగా ఆగస్టు 27న సినిమా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News