మన తెలంగాణ/కాటారం : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మేనిపెస్టో కమిటీగా మంత్రి శ్రీధర్‌బాబు విఫలమయ్యారని కాటారం మండల బిఆర్‌ఎస్ నాయకులు వ్యాఖ్యానించారు. ప్రజా సేవే పరమావదిగా మంథని నియోజకవర్గంలో ప్రజా సేవ చేస్తున్న పుట్ట మధూకర్‌పై కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని, ఇక నుండి బిఆర్‌ఎస్ నాయకులు కూడా మీ నాయకునిపై ఇలాగే వ్యవహరిస్తామని ఎద్దేవా చేశారు. సోమవారం బిఆర్‌ఎస్ కాటారం మండల అధ్యక్షుడు జోడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు.
మంత్రి శ్రీధర్‌బాబు ఇచ్చిన మాటకు కట్టుబడని మేనిఫెస్టో చైర్మన్‌గా చరిత్రలో నిలిచి పోతారని ధన్‌వాడ గ్రామ మాజీ సర్పంచ్ తొంబర్ల వెంకటరమణ, బిఆర్‌ఎస్ మండల నాయకుడు జక్కు శ్రావణ్ అన్నారు. నాయకుని మెప్పు కోసం పదవుల కోసం విలువలు కోల్పోయే విధంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని, అంబట్‌పల్లిలో గోదావరిలో మునిగి చనిపోయిన దళిత యువకుల కుటుంబాలకు ఏ విధమైన న్యాయం చేశారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు మందల లకా్ష్మరెడ్డి, కొండగొర్ల వెంకటస్వామి, గంట శ్రావణ్, గాలి సడువలి, కొండపర్తి రవి, లక్ష్మణ్, మాదాసు మొండి, రాజమౌళి, జాగిరి ఓదెలు, వంగల రాజేంద్రచారి, బోడ తిరుపతి, ముంత బాపు, ఆడెపు రమేష్, గంట సమ్మయ్య, రజాకర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.