Monday, August 25, 2025

పర్యాటక కేంద్రంగా అనంతగిరి అభివృద్ధి:మంత్రి జూపల్లి కృష్ణారావు

- Advertisement -
- Advertisement -

వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక, ఎక్సైజ్, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అనంతగిరి హరిత రిసార్ట్, అనంతగిరి వ్యూ టవర్ ప్రాంతాన్ని ఆయన సోమవారం ప్రత్యేకంగా సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హరిత రిసార్ట్టును పైలట్ ప్రాజెక్ట్ కింద పరిగణిస్తూ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు అప్పగించినట్లు తెలిపారు. ప్రైవేట్ రిసార్ట్ అందించే సౌకర్యాలకు ఏమాత్రం తగ్గకుండా హరిత రిసార్ట్టును ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని సూచించారు. ఇక్కడకు వచ్చే టూరిస్టులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించాలని,

హ్యాండ్ ఓవర్ చేసి వచ్చే టూరిస్ట్‌లకు మంచి ఆహారం, అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఈ అభివృద్ధి ద్వారా వికారాబాద్, పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు, ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చే విధంగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యాటక దృష్టిలో వికారాబాద్‌కి ఉన్న ప్రత్యేకతను ఉపయోగించుకొని, అనంతగిరి పర్వతాల అందాలు, హరిత రిసార్ట్ సౌకర్యాలు, వ్యూ టవర్‌కు పర్యాటకులు ఆకర్షితులవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, టూరిజం ఇడి ఉపేందర్ రెడ్డి, డిఇ హనుమంత్ రెడ్డి, కాంట్రాక్టర్ ప్రసాద్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News