Thursday, September 18, 2025

నిరుపేద యువ‌తికి మంత్రి కెటిఆర్ సాయం

- Advertisement -
- Advertisement -

Minister KTR assistance to young woman

హైద‌రాబాద్ : రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ మరోసారి తన మంచి మనస్సును చాటుకున్నారు.  నిరుపేద కుటుంబంలో జ‌న్మించి, తండ్రి బాధ్య‌త‌ల‌ను త‌న భుజాల‌పై వేసుకున్న ఓ యువ‌తికి అండగా నిలిచారు. ఇచ్చిన మాట ప్ర‌కారం మంత్రి కెటిఆర్ ఆ యువ‌తిని ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు పిలిపించి స‌త్క‌రించారు. ఆమె కోరిన‌ట్లు డ‌బుల్ బెడ్రూం ఇంటి ప‌త్రాల‌ను, ఆటోను అంద‌జేశారు. స‌బిత ఆలోచ‌నా విధానం, మాట తీరు త‌న‌ను ఎంతో ఆక‌ర్షించింద‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు. స‌బిత ఉన్న‌త చ‌దువుల‌కు త‌ప్ప‌కుండా స‌హాయం చేస్తాన‌ని కేటీఆర్ హామీ ఇచ్చారు. మంత్రులు కెటిఆర్, స‌బితా ఇంద్రారెడ్డి, న‌ల్ల‌గొండ జిల్లా కలెక్ట‌ర్‌కు స‌బిత ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News