Wednesday, April 30, 2025

మంత్రి కెటిఆర్‌కు కరోనా పాజిటివ్

- Advertisement -
- Advertisement -

Minister KTR Tests Covid-19 Positive

హైద్రాబాద్ : టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కెటిఆర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని కెటిఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకున్నానని, దాంతో పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానని తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని, జాగ్రత్తలు తీసుకోవాలని కెటిఆర్ సూచించారు. 2021, ఏప్రిల్ 23న మంత్రి కెటిఆర్ కరోనా బారిన పడ్డ సంగతి విదితమే. మళ్లీ తాజాగా ఆయన మరోసారి కరోనా బారిన పడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News