Monday, August 4, 2025

నీటి వాటాలో ఒక చుక్క వదులుకోం.. లోకేష్‌కు మంత్రి పొన్నం కౌంటర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః ‘లోగడ కేంద్ర ప్రభుత్వం, ఇంకా ట్రిబ్యునల్ తెలంగాణకు కేటాయించిన నీటి వాటా విషయంలో ఒక చుక్క కూడా వదులుకోం..’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ మంత్రి నారా లోకేష్ బనకచర్ల ప్రాజెక్టు విషయంలో చేస్తున్న వాదనలో ఏ మాత్రం వాస్తవం లేదని మంత్రి పొన్నం ఆదివారం మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు. నీటికి సంబంధించిన విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు సంయనంతో పరిష్కరించుకుంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. లేనిపక్షంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులు పునరావృత్తం అవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని ఆయన మంత్రి లోకేష్‌నుద్ధేశించి వ్యాఖ్యానించారు. నీటి విషయంలో మా కోటా, వాటా పూర్తికాక ముందే వరద జలాల పేరిట ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం భావ్యం కాదని మంత్రి పొన్నం ఆయనకు సూచించారు. రైతుల హక్కుల కోసం తాము బాజప్తా మాట్లాడుతామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News