Wednesday, September 17, 2025

గృహలక్ష్మి పథకం పేదలకు వరం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పేదల సొంతింటి కల నెరవేర్చడమే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశయమని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలకు సంబంధించిన జిఓను ప్రభుత్వం విడుదల చేసిన సందర్బంగా ముఖ్యమంత్రి కెసిఆర్ కు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గృహ లక్ష్మి పథకం కెసిఆర్ ప్రభుత్వం పేదలకు అందిస్తున్న వరం లాంటిదని ఆయన చెప్పారు.

ముఖ్యమంత్రి మానస పుత్రిక గృహ లక్ష్మి పథకమని పేర్కొన్నారు. సొంత జాగా ఉండి ఇంటి నిర్మాణం కోసం అర్హులైన లబ్ధిదారులకు రూ 3 లక్షల ఆర్ధిక సాయం అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3వేల ఇండ్లు చొప్పున మొత్తం 4 లక్షల ఇండ్ల నిర్మాణానికి రూ. 7,350 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. దీని వల్ల మొత్తం 4 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని మంత్రి పేర్కొన్నారు. నిత్యం పేదల సంక్షేమం కోసం ఆలోచించే మనసున్న ముఖ్యమంత్రి కెసిఆర్ అని కొనియాడారు. ముఖ్యమంత్రికి పేదల పక్షాన మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News