Saturday, May 24, 2025

సిస్టర్ స్ట్రోక్‌తో కెటిఆర్ చిన్న మెదడు చితికింది:మంత్రి సీతక్క

- Advertisement -
- Advertisement -

సిస్టర్ స్ట్రోక్‌తో కేటీఆర్ చిన్న మెదడు చితికి, అందుకే ఇష్టాను సారంగా మాట్లాడుతున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కమీషన్లు తీసుకున్నప్పుడు లేని భయం, కమీషన్ ముందుకు రావడానికి మాత్రం ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టులో బాంబులు పెట్టిందని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, దాన్ని కపిపుచ్చుకోవడానికి పిచ్చిపిచ్చిగా కెటిఆర్ మాట్లాడుతున్నారని అన్నారు. మరి అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయాన్ని ఎందుకు నిరూపించాలేదో కేటీఆర్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని తెలిపారు. సచివాలయంలో శనివారం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ అబద్దాల పునాదుల మీద వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోబెల్స్‌ను మించిన గ్లోబల్ ప్రచారానికి కేటీఆర్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ప్రతిపక్ష హోదాకు కేటీఆర్ పనికిరారన్న మంత్రి సీతక్క ప్రజల కోసం ఆయన ఎప్పుడూ పని చేయరని, కానీ అబద్దాలను ప్రచారం చేయటంలో మాత్రం ముందుంటారని ఆరోపించారు. కెసిఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని కవిత చెప్పిందని, కవిత చెప్పిన దెయ్యం నువ్వేనా కేటీఆర్ అంటూ నిలదీశారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు లేదని అన్నారు. త్యాగాల మీద రాజభోగాలనుభవించిన చరిత్ర కెసిఆర్ కుటుంబానిదని విమర్శించారు. కెసిఆర్ కుటుంబానికి దోచుకునీ, దాచుకునే చరిత్ర ఉందని విమర్శించారు. భారతదేశ ఔన్నత్యం కోసం భారతదేశ ప్రజల కోసం మాట్లాడుతున్న రాహుల్ గాంధీ మీద కక్షకట్టి ఈడిని ప్రయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న మోడీ ప్రశంసల కోసం కేటీఆర్ పాకులాడుతున్నారని తెలిపారు. సిస్టర్ స్ట్రోక్ తో బాధపడుతున్న కేటీఆర్ గాంధీ కుటుంబాన్ని, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఏదో మాట్లాడుతూ శునకానందం పొందుతున్నాడని ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News