Tuesday, July 22, 2025

ముచ్చర్ల సత్తన్న పంచాయితీ పాటను ఆవిష్కరించిన మంత్రి సీతక్క

- Advertisement -
- Advertisement -

గ్రామాల్లో సర్పంచ్‌ల గొప్పదనాన్ని వివరిస్తూ పాఠ రూపంలో ముచ్చర్ల సత్యనారాయణ అద్భుతంగా వెల్లడించారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కొనియాడారు. హైదరాబాద్‌లోని వీంద్రభారతిలో సోమవారం జరిగిన ముచ్చర్ల సత్తన్న పంచయితీ పాట ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి సీతక్క, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ముచ్చర్ల సత్తన్న పంచాయితీ పాటను ఆవిష్కరించిన అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల్లో పోటీ చేసే వాళ్లకు ఈ పాట ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ పాటను ప్రజల ముందుకు తీసుకొస్తున్న ముచ్చెర్ల సత్యనారాయణ కుమారుడు పృధ్వీకి అభినందనలు తెలిపారు. గ్రామాల్లో సర్పంచ్‌లు లేక పోవటం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్న సీతక్క గ్రామాల్లో సర్పంచ్‌లతో ఉన్న ఉపయోగాలు తనకు తెలుసునని అన్నారు. ఎప్పుడో సర్పంచ్‌ల గొప్పతనంపై ముచ్చర్ల సత్యనారాయణ పాట రాయడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News