Wednesday, September 3, 2025

పనుల జాతర ఫోటో ఆల్బమ్‌ను ఆవిష్కరించిన మంత్రి సీతక్క

- Advertisement -
- Advertisement -

ఈ ఏడాది పనుల జాతర ప్రారంభం సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టిన పనులకు సంబంధించిన 2025 ఫోటో ఆల్బమ్‌ను మంత్రి సీతక్క మంగళవారం ఆవిష్కరించారు. పనుల వివరాలను పొందుపరుస్తూ ఆల్బమ్‌ను రూపొందించడం పట్ల మంత్రి సంబంధిత అధికారులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ చేపట్టిన పనులు నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా చేపట్టాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక సదుపాయాలకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

సిఐఐ సమావేశానికి మంత్రి సీతక్కకు ఆహ్వానం
ఈ నెల 13న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) అనుబంధ సంస్థ యంగ్ ఇండియా నిర్వహించే ‘అభయం: ప్రతి చిన్నారి భయం లేకుండా జీవించాలి’ అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని పంచాయత్ రాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను సిఐఐ ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వానపత్రికను మంగళవారం మంత్రికి అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News