Saturday, August 23, 2025

యూరియా ఇప్పించండి

- Advertisement -
- Advertisement -

రామగుండం నుంచి రావాల్సిన
63వేల మెట్రిక్ టన్నుల
యూరియాను ఇప్పించాలి
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,
బండి సంజయ్‌కి ఫోన్‌లో మంత్రి
తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలోని రా మగుండం ఎరువుల కార్మాగారం నుంచి రావాల్సిన యూరియా సరఫరా విషయంలో చొరవ తీ సుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తు మ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లను కోరారు. జిల్లాలలో అందుబాటులో ఉన్న యూరియా నిల్వలు, సరఫరాలపై అధికారులతో శుక్రువారం మంత్రి తుమ్మల స మీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారు లు ఇచ్చిన సమాచారం ఆధారంగా వెంటనే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు మం త్రి తుమ్మల ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రానికి కే టాయించిన స్వదేశీ యూరియాలో మన రా ష్ట్రంలో తయారవుతున్న రామగుండం ఎరువుల క ర్మాగారం నుంచి కేటాయించినప్పటికి రామగుం డం ఎరువుల కర్మాగారం సక్రమంగా పనిచేయని కారణంగా ఉత్పత్తి నిలిచిపోతోందని దీంతో దాదా పు 63 వేల మెట్రిక్ టన్నుల యూరియా రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి సరఫరాను చేయలేకపోయినట్లు కేంద్ర మంత్రికి వివరించా రు.ఈ 63 వేల మెట్రిక్ టన్నుల యూరియాను వెంటనే రామగుండం ఎరువుల కర్మాగారం నుం చి సరఫరా చేసే విధంగా చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ఈ సందర్భంగా ఫోన్ లో కోరారు. అలాగే రామగుండం ఎరువుల కర్మాగారంలో తెలంగాణ కు కేటాయించిన యూరియా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ కు మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు.

డిమాండ్, సప్లై పరిశీలించండి
యూరియా డిమాండ్ తక్కువగా ఉన్న జిల్లాల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉన్న జిల్లాలకు యూరియాను తరలించి, రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ, రవాణాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. పాసుబుక్ లను అనుసంధానం చేసి యూరియాను పంపిణీ చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.

యూరియా దిగమతి లేకే
జియో పాలిటిక్స్ నేపథ్యం రెడ్ సీ లో నౌకాయనంలో ఇబ్బందులతో మన దేశానికి దిగుమతి కావాల్సిన యూరియా సకాలంలో అందుబాటులోకి రాకపోవడానికి తోడు దేశీయంగా రామగుండం ఎరువుల కార్మాగారం నుంచి యూరియా ఉత్పత్తి అనుకున్న స్థాయిలో లేకపోవడం వల్లే ప్రస్తుతం యూరియా కొరత పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి తుమ్మల వివరించారు. రాష్ట్రాలకు యూరియా కేటాయింపులు, సరఫరా పూర్తిగా కేంద్ర ఎరువులు రసాయనాల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండగా, ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లేలా ప్రయత్నం చేస్తుండడం విచారకమన్నారు. రైతాంగం ప్రయోజనాల కంటే రాజకీయ స్వార్థంతో విమర్శలు చేయడం, క్యూ లైన్ లో చెప్పులు పెట్టించి సోషల్ మీడియాలో ప్రభుత్వ ప్రతిష్టతను దెబ్బతీయడంపై మంత్రి తుమ్మల మండిపడ్డారు.

టోకెన్ పద్దతి పాటించండి
రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొనుగోలు కేంద్రాల వద్ద క్యూ లైన్ లు లేకుండా చూడాలని మంత్రి తుమ్మల అధికారులకు సూచించారు. విక్రయ కేంద్రాల వద్ద టోకెన్ పద్దతిలో ఉన్న నిల్వలను బట్టి రైతులకు యూరియా బస్తాలు అందించాలన్నారు. ప్రైవేట్ డీలర్ల దగ్గర ఉన్న యూరియా నిల్వలను రైతులకు వెంటనే విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతాంగం శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రైతాంగానికి అండగాఉంటామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, డైరెక్టర్ గోపి, కో ఆపరేటివ్ కమిషనర్ సురేంద్ర మోహన్, మార్క్ ఫెడ్ ఎండి శ్రీనివాస రెడ్డి, పరిశ్రమల వాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News