మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరై రైతుల కోసం యూరియా తెస్తామని వ్యవసా య శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అధికా రం కోల్పోయిన బిఆర్ఎస్ పార్టీ నేతలు ప్రాజెక్ట్ గేట్లు ఎ త్తుతాం, బటన్లు నొక్కుతామని సొల్లు మాటలు మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గురువారం మంత్రి తు మ్మల మీడియాతో మాట్లాడుతూ యూరియా కొరత తీవ్రత పై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రామచంద్ర రావు కూడా సోయి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశంలో చా లా రాష్ట్రాల్లో యూరియా కోసం రైతులు ఆందోళన చేస్తున్నారనే సంగతిని బిజెపి నేతలు గుర్తించాలని సూచించారు. ర ష్యా, ఉక్రెయిన్, ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధాల వల్ల ఎర్రసముద్రంలో నౌకాయానం నిలిచి ఇంపోర్ట్ యూరియా సరఫరాలో జాప్యం నెలకొందని తెలిపారు.
చైనా నుంచి ఇం పోర్ట్ కావల్సిన యూరియా ను సకాలంలో తెప్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. విదేశాల నుంచి యూ రియా నిర్ణీత కాలంలో దిగుమతి కావడం లేదని, దేశీయం గా ఉత్పత్తి అనుకున్న స్థాయిలో జరగడం లేదనే వాస్తవాల ను బిజేపి అంగీకరించాలన్నారు. రాష్ట్రంల నుంచి ప్రాతిని ధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజ య్ కుమార్ లను తాను వ్యక్తిగతంగా కలుసుకుని రాష్ట్రంలో 70 శాతం సన్నకారు రైతులు ఉన్నారని, రాష్ట్రంలో యూరి యా కొరత తీవ్రతను వివరించానని మంత్రి తుమ్మల తెలిపా రు. కొన్ని రాజకీయ పార్టీలు వెనుక ఉండి యూరియా కొరతపై ఆందోళనలు చేయిస్తున్నాయని ఆరోపించారు. రాజకీ య స్వార్థంతో బీఆర్ఎస్, బిజేపి పార్టీలు రైతాంగాన్ని గందరగోళానికి గురిచేస్తన్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూరియా కోసం పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, చివరకు పార్లమెంట్ ఆవరణలో మా ఎంపీలు ఆందోళన చేస్తేనే ఈ వారంలో యాభై వేల మెట్రిక్ టన్నులు యూరియా ఇస్తామని కేంద్రం దిగివచ్చిందని మంత్రి తుమ్మల వివరించారు.
వర్షాలపై మంత్రి తుమ్మల సమీక్ష
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో గురువారం వ్యవసాయ శాఖ డైరెక్టరేట్ నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గోదావరి వరదలపై అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లా అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, ఎస్పీ రోహిత్ రాజుతో మంత్రి తుమ్మల ఫోన్లో మాట్లాడిన క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరగడంతో భద్రాచలం వద్ద గోదావరి నది మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకునందున, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.