మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర రైతుల అవసరాలకు సరిపడా యూరియాను వీలైనంత త్వర గా కేటాయించి, పంపిణీ అయ్యేలా చూడాలని ఢి ల్లీలోని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రాను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర ఎరువుల కార్యదర్శిని కలిశారు. రాష్ట్ర రైతులకు సరిపడా యూరియాను ఈ పది రోజుల్లో సరఫరా చేయాలని, వివిధ కారణాలతో యూరియా దిగుమతి ఆశించిన స్థాయిలో లేదని మంత్రి వివరించారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో సాగులో ఉ న్న వరి, మొక్కజొన్న, పత్తి వంటి ప్రధాన పంటల కు యూరియా అత్యవసరంమని, ముఖ్యంగా ఈ పదిహేను రోజులు వ్యవసాయ సీజన్‌లో కీలకమైనవని తెలిపారు. ఈ సమయంలో రైతులకు ఎరువు లు అందుబాటులో లేకపోతే పంటలు తీవ్రంగా దె బ్బతింటాయని, దీంతో యూరియా సరఫరా నిరంతరంగా కొనసాగేలా చూడాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి చెప్పారు.
ఇప్పటి వరకు ఏర్పడిన యూరియా లోటును పూడ్చే విధంగా ఈ నెలలో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని కోరామని మంత్రి చెప్పారు. రానున్న పది రోజుల్లో మరో లక్ష మెట్రిక్ టన్నుల యూరియాను సరఫ రా చేయాలని కోరగా, ఈ వారంలో 80 వేల మెట్రి క్ టన్నులను సరఫరా చేస్తామని రజత్ కుమార్ మిశ్రా చెప్పారని మంత్రి వెల్లడించారు. అందులో భాగంగానే సోమవారం ఐపిఎల్, సిఐఎల్, ఎన్‌బిసిఎల్ కంపెనీల నుంచి ఐదు ఓడల ద్వారా 40 వేల మెట్రిక్ టన్నులు కేటాయిస్తూ కేంద్ర ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి పేర్కొన్నా రు. ఈ యూరియా త్వరలోనే రాష్ట్రానికి చేరుకుంటుందని, దీంతో తెలంగాణ రైతుల యూరియా కష్టాలు తగ్గుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో సెప్టెంబర్ మొదటి 15 రోజులలోనే లక్షా నాలుగు వేల మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి సరఫరా చేసినట్లు అవుతుందని మంత్రి వివరించారు. దేశీయ ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేకపోయినా, దిగుమతుల ద్వారా రాష్ట్రానికి ప్రాధాన్యత ఇస్తామని కేంద్ర కార్యదర్శి హామీ ఇచ్చారని మంత్రి వెల్లడించారు.
Also Read: కేరళలో ప్రాణాంతక అమీబా.. మెదడు కణాలు తినేసే రకం.. 18మంది మృతి