Saturday, August 16, 2025

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి: మంత్రి తుమ్మల

- Advertisement -
- Advertisement -

జూబ్లీహిల్స్‌లోని పలు కాలనీల్లో అన్ని వసతులు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఉప ఎన్నికల్లో గెలిపించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఉప ఎన్నిక ప్రచారం లో భాగంగా మంత్రి తుమ్మల పార్టీ కార్యకర్తలను ఉదేశించి శనివారం మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ విజయం సాధించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి ఎన్నో అవకాశాలు వచ్చాయి,మాదాపూర్,హైటెక్ సిటీ రోజు రోజుకు అభివృద్ధి చెందుతోందని తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని ఉన్న స్లమ్ ఏరియాలు అభివృద్ధి చెందాలి అంటే కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలోపేతం చేయాలని, తమది మాటల ప్రభుత్వం కాదని చేత ప్రభుత్వమని స్పష్టం చేశారు. గతంలో 10 సంవత్సరాలుగా పరిపాలించిన పార్టీ ఏమి చేయాలేదని విమర్శించారు.

వారి మాటలు నమ్మి మోసపోవద్దని, స్కాంలు, ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పిడిన వారు కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడడం సరికాదని అన్నారు. నేతలంతా కలిసి ఐక్యంగా పని చేయాలి, బూత్ స్థాయి నుండి కోఆర్డినేట్ చేసుకొని ప్రతి వంద ఓట్ల వివరాలు మన వద్ద ఉండాలని అన్నారు .ప్రతి బూత్ లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ రావాలి ఆయన వెల్లడించారు . కాంగ్రెస్ ప్రభు-త్వాన్ని బలోపేతం చేయండి, తమది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని అన్నారు. మన పిల్లలు మనమంతా సుఖ సంతోషాలతో బతకాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని ప్రజలు కోరుకొని మనకు పట్టం కట్టారని తెలిపారు . జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చినా మద్దతు తెలిపి ఆహ్వానించాలని అన్నారు. కారక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, కార్పొరేషన్ చైర్మన్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News