కమీషన్ల కోసమే తుమ్మిడిహట్టి నుంచి
మేడిగడ్డకు ప్రాజెక్టు స్థలం మార్పు డిపిఆర్
ఇవ్వకుండానే నిర్మాణాలు అన్నారం,
సుందిళ్లలోనూ లోపాలు ఎన్‌డిఎస్‌ఎ నివేదిక
అదే చెబుతోంది.. అయినా సిగ్గులేకుండా
మాపై విమర్శలా? ఇంజినీర్లు చెప్పినా…
ఆనాటి ప్రభుత్వ పెద్దలు వినలేదు కెసిఆర్
సహా అందరి పాత్రపై చర్చించి చర్యలు
మంత్రి ఉత్తమ్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్
మన తెలంగాణ/హైదరాబాద్: దేశ చరిత్రలోనే మానవ ని ర్మిత ప్రాజెక్టుల్లో ఎన్నడూ లేనంత ఘోరమైన మానవ ని ర్మిత వి పత్తును కాళేశ్వరం ప్రాజెక్టులో చూశామని నేషనల్ డ్యామ్ సే ప్టీ అథారిటీ (ఎన్‌డిఎస్‌ఏ) తన నివేదికలో పే ర్కొందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అడుగడుగునా ఘోర వైఫల్యాన్ని ఆనాటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం మూటగట్టుకుందని వ్యా ఖ్యానించారు. అప్పటి బీఆర్‌ఎస్ సర్కార్ కమీషన్‌లకు కక్కుర్తిపడి కాళేశ్వరం ప్రాజెక్టును లో పాలమయంగా చేపట్టి రాష్ట్ర ఆ ర్థిక వ్యవస్థను ఘోరంగా దెబ్బతీసిందని, రైతులను దగా చేసిందని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్‌డిఎస్‌ఏ ఇ చ్చిన తుది నివేదికపై మంగళవారం మంత్రి ఉత్తమ్ రాష్ట్ర సచివాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తుది నివేదికలోని అన్ని అంశాలను ఆయన ఈ సందర్భంగా మీడియాకు వివరించారు. గత ప్రభుత్వ హయాంలోనే జరిగిన ప్రా జెక్టు డిజైన్,
నిర్మాణంలో లెక్కలేనన్ని లోపాలు ఉన్నాయని, అందువల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని నివేదిక స్పష్టం చేసిందని తెలిపారు. ఈ నివేదిక పేర్కొన్న అంశాలతో సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి ఎన్‌డిఎస్‌ఏ రిపోర్టునే కించపరుస్తారా? అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది బిఆర్‌ఎస్ నేతల మూర్ఖత్వంగా ఆయన పేర్కొన్నారు. నివేదికలో పేర్కొన్న మేరకు ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం లోపం, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపాలతో మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిందని ఎన్‌డిఎస్‌ఏ స్పష్టం చేసిందని చెప్పారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు చేపట్టడం, వారి హయాంలోనే కూలిపోవడం, అనంతరం ఎన్‌డిఎస్‌ఏ తొలి సందర్శన చేయడం, ఆ తర్వాత నివేదిక ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇలా గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాన్ని ఒప్పుకోకుండా తమ ప్రభుత్వంపై నిందలు మోపతున్నారని ధ్వజమెత్తారు.
ఆనాటి ప్రభుత్వంలోని బాధ్యులందరిపైనా చర్యలు తప్పవు
ఎన్‌డిఎస్‌ఏ తుది నివేదిక రెండు రోజుల కిందటే తమకు అందిందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు యావత్తు అన్ని దశల్లో ఘోర తప్పిదాలు జరిగినట్లు నివేదిక తేల్చిందని అన్నారు. ఈ నివేదికను త్వరలో జరిగే మంత్రి వర్గ సమావేశంలో చర్చించి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది నిర్ణయిస్తామని తెలిపారు. ప్రాజెక్టులో జరిగిన అవినీతి, సాంకేతిక తప్పిదాలు, నిర్మాణ వైఫల్యాలు తదితర అంశాలకు ఎవరెవరు బాధ్యులు, ఆనాడు పనులు చేపట్టాలని ప్రభుత్వంలోని పెద్దలు గానీ, మంత్రులు గానీ ఎవరు ఆదేశించారనే వివరాలు తెలుసుకుని వారందరిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు చేపట్టిన సమయంలో ముఖ్యమంత్రిగా, నీటిపారుదల శాఖ మంత్రిగా కెసిఆర్ ఉన్నారని ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ ఈ మొత్తం వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందనేది చర్చించిన తర్వాత చర్యలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా మేడిగడ్డ ప్రాజెక్టును కొనసాగించాలా, లేక ప్రత్యామ్నాయం చూడాలా అనేది కూడా త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.
మేడిగడ్డే కాకుండా అన్నారం, సుందిళ్ల పరిస్థితీ ఇంతే
మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలోనూ ఇదే తరహా లోపాలు ఉన్నాయని ఈ నివేదిక స్పష్టం చేసిందని మంత్రి తెలిపారు. డీపీఆర్ తయారీకి తగిన సమయం ఇవ్వకుండా హడావుడి చేశారని, నాణ్యమైన, పటిష్టమైన డిపిఆర్ లేకుండా గత ప్రభుత్వం రాజీపడిందని నివేదిక స్పష్టం చేసిందన్నారు. ముందు నిర్మాణాన్ని ప్రారంభించి ఆ తర్వాత డిపిఆర్‌ను సిడబ్లుసికి సమర్పించినట్లు నివేదిక పేర్కొందని తెలిపారు. ఇది పూర్తిగా ప్రాజెక్టు నిర్మాణ లోపాన్ని ఎత్తి చూపుతోందని అన్నారు. డిపిఆర్‌లో అనుకున్న దానికి భిన్నంగా బ్యారేజీల నిర్మాణ సమయంలో అసాధారణమైన, గణనీయమైన మార్పులు జరిగాయని, నిర్మాణ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అన్నారం,
సుందిళ్ల బ్యారేజీల స్థలాన్ని వరుసగా 2.2 కి.మీ., 5.4 కిలోమీటర్లు దిగువకు మార్చారని తెలిపారు. ఈ రెండు బ్యారేజీల కొత్త ప్రదేశాలు నది పరీవాహక మట్టానికి దిగువన ఉండటం చాలా అసాధారణమని, దీంతో అన్నారం బ్యారేజీకి ఎగువన భారీగా ఇసుక మేటలు వేశాయని నివేదికలో ఎన్‌ఎస్‌డిఏ పేర్కొన్నదని చెప్పారు. మూడు బ్యారేజీలలో షీట్ పైల్స్ స్థానంలో సీకెంట్ పైల్స్ వచ్చాయని సీబీఐపీ మార్గదర్శకాల ప్రకారం జియోటెక్నికల్ పరిశోధనల కోసం 85 బోర్ హోల్స్ అవసరం కాగా కేవలం 6 బోర్ హోల్స్ మాత్రమే తవ్వినట్లు ఎన్‌ఎస్‌డిఏ గుర్తించిందని వివరించారు. సిడిఓ పనిని చేయనివ్వకుండా అధికారంలో ఉన్నవాళ్లు నిరంతర జోక్యం చేసుకున్నట్లు నివేదిక వెల్లడించిందని మంత్రి పేర్కొన్నారు.
తమ్మిడిహెట్టిని కాదని మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణమే పెద్ద తప్పు
కమీషన్లకు కక్కుర్తిపడే గత ప్రభుత్వ పెద్దలు కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని మంత్రి ఆరోపించారు. అందుకే అంచనాలు భారీగా పెంచారని ఎన్‌డిఎస్‌ఏ నివేదికలో పేర్కొందని తెలిపారు. తుమ్మడిహట్టి వద్ద చేపట్టాల్సిన ప్రాజెక్టును కాదని మేడిగడ్డ వద్దకు మార్చి గత వైఎస్‌ఆర్ ప్రభుత్వ హయాంలో రూ.34 వేల కోట్లకు చేపట్టాల్సిన ప్రాజెక్టును 80 వేల కోట్లకు పెంచారని మంత్రి ఆరోపించారు. అంతేకాకుండా రూ.80 వేల కోట్ల అనుమతులు తీసుకుని లక్ష కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. మేడిగడ్డ ప్రారంభానికి ముందే ప్రాజెక్టులో లోపాలు బయటపడ్డాయని అయితే బీఆర్‌ఎస్ ప్రభుత్వం వాటిని ఒప్పుకోకపోవడం వల్లే తీవ్ర నష్టం జరిగిందన్నారు. తమ్మిడిహెట్టిని కాదని మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించడమే ప్రధాన లోపం అని ఎన్‌డిఎస్‌ఏ చాలా స్పష్టంగా నివేదికలో పేర్కొందని తెలిపారు. మేడిగడ్డ ప్రతిపాదనను సీడబ్ల్యూసీ ప్రారంభంలోనే తోసిపుచ్చిందని ఉత్తమ్ తెలిపారు. బ్యారేజీ నిర్మాణానికి మట్టి పరీక్షలు, నాణ్యత పరీక్షలు వంటివి ఏమీ చేయలేదన్నారు.
లోపాలు ఉన్నాయని ఇంజినీర్లు చెప్పినా పట్టించుకోలేదన్నారు. తమ్మిడిహట్టి మార్పు వల్లే ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు తీవ్ర నష్టం జరిగిందని ఉత్తమ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణహిత- చేవెళ్ల డిజైన్ మార్చేసి రూ.80 వేల కోట్లతో ప్రాజెక్టు నిర్మిస్తామని చెప్పి లక్ష కోట్లు అప్పు చేశారని ఆయన విమర్శించారు. రక రకాల కార్పొరేషన్ల పేరుతో అప్పులు చేశారని, ఇది చాలదన్నట్టు ఎక్కువ వడ్డీకి షార్ట్ టర్మ్ రుణాలు కూడా తీసుకున్నారని అన్నారు. ఇందుకు నీటిపారుదల శాఖ ఏటా రూ.16 వేల కోట్ల వడ్డీలు చెల్లిస్తోందని అన్నారు. ఎన్‌డిఎస్‌ఏ అధికారులు సూచించిన నిబంధనలను ఎక్కడా ఫాలో కాలేదని తెలిపారు. సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను కట్టాల్సిన చోట నిర్మించలేదని చెప్పారు. డీపీఆర్ అంతా హడావుడిగా చేశారని, ఒక్కో బ్యారేజీ ఒక్కో రకంగా నిర్మించారని ఎన్‌డిఎస్‌ఏ నివేదికలో స్పష్టం చేసిందని వివరించారు. తుమ్మిడి హెట్టి దగ్గర కూడా ప్రాజెక్టు కడ్తామని చెప్పిన పదేండ్లలో తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదని మంత్రి పేర్కొన్నారు.