- Advertisement -
సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ ప్రాజెక్టు కింద ఉన్న ఎర్రవల్లి గ్రామ రైతుల వ్యవసాయ భూములకు నీళ్లు విడుదల చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎర్రవల్లి గ్రామ రైతులు తమ సమస్యలపై గురువారం రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డిని కలుసుకున్నారు. దాంతో కమిషన్ చైర్మన్ వెంటనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి ఎర్రవల్లి రైతుల సాగునీటి సమస్యలను తీసుకువచ్చారు. దాంతో సిద్దిపేట జిల్లాలో సాగునీటి అంశాలను అధికారులను అడిగితెలుసుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లాలో ఉన్న కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు నుంచి ఎర్రవల్లి రైతుల పంటలకు నీటిని విడుదల చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
- Advertisement -