Thursday, July 17, 2025

హైకోర్టులో ఉత్తమ్ పిటిషన్ విచారణ వాయిదా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా తనపైన నమోదయిన కేసులను కొట్టివేయలని కోరుతూ పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లపై బుధవారం జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావుకు నోటీసులు జారీ చేసింది. అనంతరం జస్టిస్ కె.లక్ష్మణ్ తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేశారు. కాగా, ఎన్నికల సందర్భంగా నేరేడుచర్లతో పాటు మఠంపల్లి పోలీస్ స్టేషన్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News