Wednesday, September 10, 2025

కెటిఆర్‌కు నీటిపారుదలపై అవగాహన లేదు:మంత్రి వివేక్ వెంకటస్వామి

- Advertisement -
- Advertisement -

మల్లన్నసాగర్‌కు ఎల్లంపల్లి నుంచే నీళ్లోస్తాయని, కెటిఆర్‌కు నీటి పారుదలపై అవగాహన లేదని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ఒక ఫెయిల్డ్ ప్రాజెక్టు అని తాను గతం లోనే చెప్పినట్లు గుర్తు చేశారు. మల్లన్నసాగర్ ఒక పెద్ద కుంభకోణమని అన్నారు. కెసిఆర్ కోసమే కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ నిర్మించా రని ఆరోపించారు. సిఎం రేవంత్‌రెడ్డి భూమి పూజ చేసింది ఒరిజినల్ ప్రాజెక్టు అని చెప్పారు. కెటిఆర్ ఫారెన్ మ్యాన్‌గా మాట్లాడుతున్నారన్నారు. పాత ప్రాజెక్టు ద్వారానే హైదరాబాద్‌కు నీళ్లొస్తాయని తెలిపారు.

దేశంలో ట్రెండ్ సెట్టర్‌గా ఉండాలని పని చేస్తున్నాం…
అదే విధంగా దేశంలో ట్రెండ్ సెట్టర్ గా ఉండాలని పనిచేస్తున్నామని చెప్పారు. విదేశాల్లో మంచి ఉద్యోగాలు సాధించేందుకు స్టూడెంట్స్‌కు స్కిల్స్ నేర్పిస్తామని వెల్లడించారు. 46 ఎటిసిలు స్థాపిస్తున్నామని, 46 ఎటిసి సెంటర్లలో 98 శాతం అడ్మిషన్లు అయ్యాయని చెప్పారు. ఫ్యాకల్టీని సమకూ ర్చాలని సిఎంను కోరామన్నారు. ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యం అని వివేక్ అన్నారు. టామ్ కామ్ సంస్థతో స్టూడెంట్స్‌కు శిక్షణ ఇచ్చేం దుకు కీలక ఒప్పందం కదుర్చుకున్నామని వెల్లడించారు. సాఫ్ట్ స్కిల్స్ ను టామ్ కామ్ నేర్పిస్తుందన్నారు. అక్కడ మనోళ్లకు లాంగ్వేజ్ సమస్య ఉండొద్దని ఉద్దేశంతో జర్మనీ, జపాన్ లాంగ్వేజ్ స్కిల్స్ నేర్పిస్తామని మంత్రి వివేక్ చెప్పారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News