Thursday, August 28, 2025

అమెరికాలో కాల్పులు: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికాలోని మిన్నెసోటాలో కాల్పులు కలకలం సృష్టించింది. మినియాపోలిస్‌లో అనున్ సియాటన్ క్యాథలిక్ చర్చిలో విద్యార్థులు ప్రార్థనలు చేస్తుండగా ఓ దుండగుడు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో ఇద్దరు చనిపోయారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో దుండగుడు కూడా దుర్మరణం చెందాడు. 17 మంది గాయపడడంతో వివిధ ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రులలో 14 మంది పిల్లలు ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుండుగుడి వయసు 20 సంవత్సరాలు ఉంటుందని పోలీస్ అధికారి బ్రియాన్ ఓహార్ ప్రకటించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News