సూపర్ హీరో తేజ సజ్జా పాన్- ఇండియా విజువల్ వండర్ ‘మిరాయ్’లో సూపర్ యోధ పాత్రలో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ట్రైలర్ ఆగస్టు 28న లాంచ్ చేయనున్నారు. హీరో, విలన్ పవర్‌ఫుల్‌గా కనిపించిన ట్రైలర్ పోస్టర్ అదిరిపోయింది.
తేజ సూపర్ యోధాగా ఎనర్జీతో మెరుస్తున్న మ్యాజికల్ స్టిక్ తో కనిపించగా, మనోజ్ భారీ ఖడ్గాన్ని పట్టుకుని ఎదురు నిలబడ్డాడు. ఈ పోస్టర్‌తో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో తేజ సజ్జ సరసన రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీయా శరణ్, జయరామ్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ట్రైలర్ పోస్టర్ ద్వారా మేకర్స్ సినిమాను సెప్టెంబర్ 12న ఎనిమిది భాషల్లో 2డి, 3డి ఫార్మాట్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
Also Read: పోక్సో కేసులో దోషికి 51ఏళ్ల జైలుశిక్ష