Thursday, May 29, 2025

‘మిరాయ్’ టీజర్ వచ్చేసింది.. అంచనాలు పెంచేసిన అద్భుత విజువల్స్

- Advertisement -
- Advertisement -

‘హను-మాన్’ సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న తేజ సజ్జా నటిస్తున్న జాతా చిత్రం ’మిరాయ్’. ఈ పాన్ ఇండియా యాక్షన్ -అడ్వెంచర్ చిత్రంలో తేజ సజ్జా సూపర్ యోధగా నటిస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న మిరాయ్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, గ్లింప్స్ మూవీపై భారీ అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో అద్భుతమైన విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ‘9 బుక్స్, 100 ప్రశ్నలు, ఒక స్టిక్.. బిగ్ అడ్వెంచర్’ అంటూ తేజ చెప్పిన డైలాగ్ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది. విజువల్, యాక్షన్ సీన్స్ తో టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ పాన్ ఇండియా చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 8 వేర్వేరు భాషలలో 2డి, 3డి ఫార్మాట్లలో గ్రాండ్‌గా విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.  రాకింగ్ స్టార్ మనోజ్ మంచు విల న్ పాత్రలో కనిపించనున్నారు. తేజ సజ్జా సరసన రితికా నాయక్ కథానాయికగా నటిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News