Thursday, August 28, 2025

నెవర్ బిఫోర్.. విజువల్ వండర్ గా ‘మిరాయ్’ ట్రైలర్

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘మిరాయ్’. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. గురువారం ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. తెలుగులో గతంలో నెవర్ బిఫోర్ అన్నట్లుగా ఈ ట్రైలర్ అద్భుతంగా ఉంది. భారీ యాక్షన్ సీన్స్, అబ్బురపరిచే విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో పవర్‌ఫుల్‌ విలన్ మంచు మనోజ్ నటించారు. సూపర్ యోధగా నటిస్తున్న తేజ సరసన రితికా నాయక్ నటించారు. శ్రీయా శరణ్, జయరామ్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించిన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ఈ సినిమాను సెప్టెంబర్ 12న ఎనిమిది భాషల్లో 2డి, 3డి ఫార్మాట్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News