Tuesday, May 6, 2025

తెలంగాణను దోచుకున్న దొంగలు బిఆర్ఎస్ నాయకులు: అద్దంకి దయాకర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక పరిస్థితిని నిజాయితీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారని ఎమ్ ఎల్ సి అద్దంకి దయాకర్ తెలిపారు. ఈటల హాఫ్ బిజెపి.. హాఫ్ బిఆర్ఎస్ అని దయాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సిఎం కెసిఆర్ చేసిన అప్పులకు నెలకు రూ.7 వేల కోట్లు కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. తెలంగాణను దోచుకున్న దొంగలు బిఆర్ఎస్ నాయకులని, ఉద్యమం చేస్తున్నట్లు నటించి పార్టీ నిర్మించుకున్నారని అన్నారు. కెసిఆర్ గుణం ఇంకా మారలేదని  విమర్శించారు. కెటిఆర్ కాలు విరిగినా ఆయనే ప్రెస్ మీట్ పెట్టాలా? అని అద్దంకి ప్రశ్నించారు. కెటిఆర్ ను పైకి తేవడానికి పద్ధతి ప్రకారం కెసిఆర్ ప్లాన్ చేస్తున్నారని, బిఆర్ఎస్ రజతోత్సవ సభలో హరీష్ రావు ఫొటో కూడా లేదని ఎద్దేవా చేశారు. హరీష్ రావును కరివేపాకులా పక్కన పెట్టారని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News