మన తెలంగాణ/కమ్మర్‌పల్లి : మండల కేంద్రంలోని మిసిమి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఉప్లూర్ గ్రామానికి చెందిన యెనుగందుల సౌమిత్ జాతీయ స్థాయి అండర్ 19, ఫిప్టీ బాల్ క్రికెట్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల కరెస్పాండెంట్ బాలి రవీందర్ తెలిపారు. గత నెల జూన్ 7,8 తేదీలలో అసిఫాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ఫిఫ్టీ బాల్ క్రికెట్ అసోఫియేషన్ ఆద్వర్యంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో అత్యుత్తమ కనబరిచిన సౌమిత్ జాతీయ స్థాయి అండర్19, ఫిఫ్టీ బాల్ క్రికెట్ పోటీలలో పాల్గొని రాష్ట్ర జట్టుకు ఎంపికైనట్లు మంగళవారం తెలిపారు. జాతీయ స్థాయి అండర్19, ఫిఫ్టీ బాల్ క్రికెట్ పోటీలకు మిసిమి విద్యార్థి ఎంపికవ్వడం పట్ల కరెస్పాండెంట్ బాలి రవీందర్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ నెల 10 నుండి 14వ తేదీ వరకు ఒరిస్సా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో రాష్ట్రంలో జరిగే 3వ జాతీయ స్థాయి జాతీయ స్థాయి అండర్ 19 ఫిఫ్టీ బాల్ క్రికెట్ పోటీల్లో రాష్ట్ర జట్టు తరపున సౌమిత్ పాల్గొంటారని తెలిపారు. ఈ మేరకు మంగళవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ అండర్19 ఫిఫ్టీ బాల్ క్రికెట్ పోటీలకు ఎంపికైన విద్యార్థి సౌమిత్, వ్యాయామ ఉపాధ్యాయులుసంజీవ్‌ను పాఠశాల కరెస్పాడెంట్ బాలి రవీంధర్, ఉపాధ్యాయ బృందం సభ్యులు అభినందించారు.