Sunday, May 25, 2025

పపంచ సుందరి పోటీలపై మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆతిథ్యం ఇస్తున్న ప్రపంచ సుందరి పోటీలపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఓ వేశ్యలా చూశారని తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. అర్ధంతరంగా పోటీల నుంచి తప్పుకున్న మాగీ ‘ది సన్’ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వూలో పలు ఆరోపణలు చేశారు. సమాజంలో మార్పు కోసం, యువతలో స్ఫూర్తి నింపేందుకు తాను హైదరాబాద్ వెళ్లానని, కానీ తనకు అక్కడ చేదు అనుభవాలు ఎదురైనట్లు పేర్కొన్నారు. తనతో కొందరు అగౌరవంగా ప్రవర్తించారని, వినోదం కోసం తమను వీధుల్లో కోతుల తరహాలో నిర్వహకులు తిప్పారని, ఇది చాలా అసౌకర్యంగా అనిపించినట్లు పేర్కొంది. పురుష స్పాన్పర్ల ముందు పరేడ్ చేయించడం, విపరీతమైన మేకప్ వేసుకోవాలని సూచించడం, ఉదయం నుంచి రాత్రి వరకు ఈవినింగ్ గౌనులు ధరింపజేయడం ఇలాంటివి తనను ఇబ్బంది పెట్టినట్లు అసంతృప్తి వ్యక్తం చేసింది. పోటీల్లో పాల్గొనేందుకు ఈ నెల 7న హైదరాబాద్ చేరుకున్న మాగీ 16న తిరిగి స్వదేశానికి వెళ్లారు.ఆమె స్థానంలో మిస్ ఇంగ్లాండ్ రన్నరప్ చార్లొట్టే గ్రాంట్(25)ను బరిలోకి దింపారు.

మాగీ వైదొలగిన విషయాలపై మిస్ వరల్డ్ సంస్థ స్పందించింది. సంస్థ ఛైర్‌పర్సన్, సీఈఓ జూలియా మోర్లే శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ నెల ప్రారంభంలో మిల్లా మాగీ తన తల్లి, కుటంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించి అత్యవసర పరిస్థితి కారణంగా ఈ పోటీల నుంచి విరమించుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారనారు. మిల్లా పరిస్థితిని అర్థం చేసుకొని ఆమెను ఇంగ్లాండ్‌కు తిరిగి పంపే ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఆమె స్థానంలో రన్నరప్ చార్లొట్టే గ్రాంట్ ఇంగ్లాండ్ తరపున ప్రాతినిధ్యం వహించేందుకు ముందుకొచ్చారని, ఆమె బుధవారం హైదరాబాద్ చేరుకున్నారని, ఈ పోటీలలో ఆమె ఇంగ్లాండ్ తరపున పాల్గొంటున్నారని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. యుకె మీడియా సంస్థలు మిల్లా మాగీ ఎదుర్కొన్న అనుభవాలపై తప్పుడు కథనాలను ప్రచురించినట్లు సంస్థకు తెలిసిందన్నారు. ఆ కథనాలు పూర్తిగా నిరాధారమైనవని జూలియా వెల్లడించారు. మిస్ వరల్డ్ పోటీల ప్రారంభ సమయంలో మిస్ మిల్లా మాగీ స్వయంగా వ్యక్తపరిచిన భావాలు, ఎడిట్ చేయని వీడియో క్లిప్‌లను మిస్ వరల్డ్ సంస్థ విడుదల చేసింది. అందులో ఆమె ఆనందాన్ని, కృతజ్ఞతను, ఈ అనుభవాన్ని మెచ్చుకుంటూ మాట్లాడిన దృశ్యాలు కూడా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News