- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 72వ మిస్ వరల్డ్(Miss World) పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో 110 దేశాలకు చెందిన సుందరీమణులు ఈ కిరీటం కోసం పోటీ పడుతున్నారు. భారత తరఫున మిస్ ఇండియన్ నందినీ గుప్తా.. ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని(Hyderbad) గచ్చిబౌలి స్టేడియంలో ‘జయజయహే తెలంగాణ’ పాటతో ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించిన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పరచయ కార్యక్రమంలో పోటీదారులు విభిన్న వస్త్రధారణతో అలరించారు.
- Advertisement -