మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ 2025 పోటీల్లో భాగంగా వివిధ దేశా ల నుంచి వచ్చిన అందగత్తెలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను వరుసగా పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్ ఇం టిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఆదివారం సందర్శించారు. అనంతరం రాష్ట్ర పాలన కేంద్రం సచివాలయానికి చేరుకుని తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి సమర్పించి నమస్కరించారు. ఉదయం బంజారాహిల్స్‌లోని తెలంగాణా ఇంటిగ్రేటెడ్ కమండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు. 107 దేశాల మిస్ వరల్డ్ కంంటెస్టర్లు కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించి, రాష్ట్రంలో శాంతి భద్రతల రక్షణకు ప్రభుత్వం అ మలు చేస్తున్న పలు విధానాలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. వీరికి పోలీస్ అశ్విక దళం, పైపు బ్యాండ్, మోటర్ సైకిల్ రైడర్స్, స్నిప్పర్ డాగ్ స్క్వాడ్ లతో పోలీస్ శాఖ స్వాగతం పలికింది. పోలీస్ కమాండ్ కంట్రోల్ ఆడిటోరియంలో వీరికి పో లీస్ శాఖ అమలు చేస్తున్న పలు విధానాలు, అవి పనిచేసే వి ధానంపై ప్రజంటేషన్ ద్వారా వివరించారు.రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, మహిళలు పిల్లలపై వేధింపుల నివారణ, డ్రగ్స్ కట్టడికి చేపట్టిన చర్యలు, నేరాల నియంత్రణ, నేర నివారణలో ఉప యోగిస్తున్న ఆధునిక శాస్త్ర సాంకేతిక పద్ధతులు తదితర
అంశాలపై తెలంగాణా పోలీస్ శాఖ చేపట్టిన పటిష్టమై న చర్యల పట్ల మిస్ వరల్ కంటెస్టర్లు సంతృప్తిని వ్యక్తం చేశా రు. డ్రగ్స్ నివారణకై తెలంగాణా పోలీస్ చేపట్టిన చర్యలకు త మ సంపూర్ణ మద్దతు తెలియ చేస్తూ పోస్టర్లపై సంతకాలు చేసి పలు మెసేజ్‌లను కూడా రాసారు. అనంతరం, తెలంగాణా పండగలు, సంస్కృతీ, సంప్రదాయాలను కళ్ళ ముందించేలా శాస్త్రీయ నృత్య ప్రదర్శన జరిగింది. ఈ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన పోలీసు ఆయుధాల ప్రదర్శన, ఆక్టోపస్, గ్రే హౌండ్స్, పోలీస్ జాగిలాల ప్రదర్శనలు, పైప్ బ్యాండ్, అశ్విక దళంలను ప్రపంచ సుందరీమణులు ఆసక్తిగా పరిశీలించి సె ల్ఫీలను దిగారు. అత్యాధునిక కమాండ్ కంట్రోల్ గదిలో ఏర్పా టు చేసి న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, సర్వేలెన్స్ ఫీడ్‌లు, తక్షణమే స్పందించే వ్యవస్థను మిస్ వరల్ కాంటెస్టర్లు స్వ యంగా పరిశీలించారు. సురక్షిత టూరిజంకు, రాష్ట్ర అభివృద్ధికి భద్రతా చర్యలు ఎంతటి కీలక పాత్ర వహిస్తాయో తెలంగాణా పోలీస్‌ను ఉదాహరణ చెప్పవచ్చని అందగత్తెలు అభిప్రా యం వ్యక్తం చేశారు. అనంతరం, మరే రాష్ట్రంలో లేని విధం గా, ట్రాఫిక్ నియంత్రణ చర్యలకు సేవలందిస్తున్న ట్రాన్స్ జెండర్లతో కలసి వారు ఫోటోలు దిగారు.
ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యతలు, పథకాల అమలు తీరును మిస్ వరల్ కంటెస్టెంట్లకు పరిచయం చేసేలా డ్రోన్ షోను ప్రభు త్వం అట్టహాసంగా నిర్వహించింది. సచివాలయం వద్ద ప్రపం చ సుందరీమణులకు ప్రభుత్వ అధికారులు ఘన స్వాగతం ప లికారు. అనంతరం వారు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నమస్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్వహించిన డ్రోన్ షో ద్వారా తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మి పథకం, గ్యాస్ సబ్సిడీ, ఇతర సంక్షేమ పథకాలను డ్రోన్ షో ద్వారా ప్రదర్శించారు. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాల ను తెలిపే విధంగా వివిధ ఆకృతుల్లో డ్రోన్లను ప్రదర్శించారు. నూతన సచివాలయం రాత్రి వేళ విద్యుత్ దీపాలంకరణతో మెరిసిపోతుండడంతో వారంతా ఫోటోలు దిగి ఆనందించారు.