Friday, May 16, 2025

యాదగిరి గుట్టను సందర్శించిన ప్రపంచ సుందరీమణులు

- Advertisement -
- Advertisement -

ప్రపంచ సుందరీమణులు యాదగిరి గుట్టను సందర్శించారు. గురువారం సాయంత్రం గుట్టకు చేరుకున్న వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుందరీమణులందరూ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత అఖండ దీపారాధన మండపంలో నిర్వహించిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు.

మిస్ వరల్డ్ అందెగత్తెలు బుధవారం వరంగల్, ములుగు జిల్లాల్లో సందడి చేసిన సంగతి తెలిసిందే. తెలుగు తనం ఉట్టిపడేలా పట్టుచీర, పట్టు పరికిణీలు కట్టుకొని, తిలకం దిద్దుకొని అచ్చం తెలంగాణ అమ్మాయిలను మరిపించేలా ప్రపంచ సుందరీమణులు రామప్ప ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రామప్ప ఆలయ విశిష్టత, చరిత్రను అడిగి తెలుసుకున్నారు. పురాతన ఆలయాన్ని తిలకించి మంత్రముగ్ధులయ్యారు. ఆలయ తీరుతెన్నులను తనివితీరా తిలకించి ఫిదా అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News