- Advertisement -
పంజాబ్ లోని జేతువాల్, మఖాన్ విండి, పంధేర్ పొలాల్లో ఓ క్షిపణి శకలాలను గుర్తించారు. పాక్ లోని ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సిందూర్ చేపట్టిన వేళ బుధవారం రాత్రి ఈ ప్రదేశంలో భారీ చప్పుడు వచ్చిందని, ఆ తర్వాత విద్యుత్ సరఫరా ఆగిపోయిందని స్థానికులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు , సైనికదళాలు కూడా అక్కడకు చేరుకున్నారు. మఖాన్ విండి గ్రామం అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం 30 కిమీ దూరంలో ఉంది. ఇక్కడికి సమీపం లోని ఓ పొలంలో దాదాపు ఆరు అడుగుల పొడవైన శకలం కూడా కనిపించింది.
- Advertisement -