ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామి బంగారాన్ని కొందరు దుండగులు మాయం చేశారు. ఏకంగా కేజీల్లోనే బంగారాన్ని నొక్కేశారు. ఆలయంలో ప్రస్తుతం 4.5 కిలోల బంగారం మాయం కావడం సంచలనంగా మారింది. రూ.5 కోట్లు విలువ చేసే బంగారం మాయం కావడంపై కేరళ హైకోర్టు తీవ్రంగా స్పందించి విచారణకు ఆదేశించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ట్రావెన్కోర్ దేవస్థానమ్ బోర్డు (టిడిబి) అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2019లో ద్వారపాలకుల విగ్రహాలకు కొత్తగా బంగారు తాపడం చేయించేందుకు పాత రాగి రేకులను తొలగించారు.
ఆ సమయంలో వాటి బరువు 42.8 కిలోలుగా నమోదైంది. అయితే, పనులు చేపట్టడానికి చెన్నైలోని ఓ సంస్థకు ఆ బాధ్యతలను అప్పగించారు. ఆ సమయంలో బరువు 38.258 కిలోలకు పడిపోయింది. ఈ రెండు సంఘటనల మధ్య దాదాపు 4.54 కిలోల తేడా ఉండటంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దాదాపు రూ.5 కోట్ల విలువైన బంగారం మాయం కావడంపై సమగ్ర విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సంఘనటపై కచ్చితంగా లోతైన విచారణ జరగాలని జస్టిస్ రాజా విజయరాఘవన్, జస్టిస్కెవి జయకుమార్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ALso Read: సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు:కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి