2026లో టి-20 ప్రపంచకప్ జరగనుంది. అయితే ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌కి ముందు ఆస్ట్రేలియాకు ఊహించని షాక్ తగిలింది. ఆసీస్ స్టార్ పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc) అంతర్జాతీయ టి-20ల నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించారు. వన్డేలు, 2027 వన్డే ప్రపంచకప్‌పై దృష్టి సారించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టార్క్ తన టి-20 కెరీర్‌ని 2012లో ప్రారంభించాడు. కెరీర్‌లో 65 టి-20 మ్యాచులు ఆడి 79 వికెట్లు తీశాడు. 2022లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఇదే అతని కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన.
2021లో టి-20 ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా టీంలో స్టార్క్ (Mitchell Starc) కూడా ఉన్నాడు. టెస్ట్ క్రికెట్‌కే తాను అధిక ప్రాధాన్యత ఇస్తానని స్టార్క్ రిటైర్‌మెంట్ సందర్భంగా వెల్లడించాడు. స్టార్క్ లేని లోటు వచ్చే ఏడాది జరిగే టి-20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టులో తప్పకుండా కనిపిస్తుంది. స్టార్క్ అనూహ్యంగా టి-20 రిటైర్‌మెంట్ ప్రకటించడంతో అభిమానులు షాక్‌కి గురయ్యారు.
Also Read : ప్రపంచ రికార్డు సమం చేసిన కుర్రాడు.. అన్ని వికెట్లు అలాగే..