Wednesday, September 3, 2025

పొట్టి క్రికెట్‌కు మిచెల్ స్టార్క్ అల్విదా

- Advertisement -
- Advertisement -

సిడ్నీ: ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ అంతర్జాతీయ ట్వంటీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డేలు, టెస్టులపై దృష్టి సారించాలనే ఉద్దేశంతో ఈ ఫార్మాట్ నుంచి తప్పుకుం టున్నట్టు పేర్కొన్నాడు. ఈ విషయాన్ని స్టార్క్ మంగళవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. స్టార్క్ టి20లలో ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించాడు. అంతేగాక 2021లో టి20 వరల్డ్‌కప్ సాధించిన ఆస్ట్రేలియా టీమ్‌లో స్టార్క్ సభ్యుడిగా ఉన్నాడు. స్టార్క్ 2024 టి20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా తరఫున చివరి సారిగా ఆడాడు. అప్పటి నుంచి పొట్టి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు.

యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో తాను ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతు న్నానని స్టార్క్ వివరించాడు. తన నిర్ణ యంతో రానున్న 2026 టి20 వరల్డ్ కప్‌లో యువ బౌలర్లను ఎంపిక చేసుకోవ డానికి సెలెక్టర్లకు అవకాశం దొరుకుతుం దన్నాడు. ఇక తన దృష్టంతా రానున్న వన్డే వరల్డ్‌కప్, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్, యాషెస్, భారత్ సిరీస్‌లపైనే నిలిచింద న్నాడు. కెరీర్‌లో తాను టెస్ట్ క్రికెట్‌కే తొలి ప్రాధాన్యత ఇస్తానని స్టార్క్ స్పష్టం చేశాడు. కాగా, స్టార్క్ కెరీర్‌లో 65 అంత ర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడాడు.23.8 యావరేజ్‌తో 79 వికెట్లను పడగొట్టాడు. ఇక వనడేల్లో 244, టెస్టుల్లో 402 వికె ట్లను స్టార్క్ తన ఖాతాలో వేసుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News