అంతర్జాతీయ టి-20 క్రికెట్‌కు ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) ఈ మధ్యనే గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. వన్డేలు, టెస్ట్‌లపై దృష్టి సారించడం కోసం పొట్టి ఫార్మాట్‌కి వీడ్కోలు పలుకుతున్నట్లు స్టార్క్ వెల్లడించాడు. అంతర్జాతీయ టి-20ల్లో 65 మ్యాచులు ఆడిన స్టార్క్ 79 వికెట్లు తీశాడు. 2021లో టి-20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకున్న జట్టులో స్టార్క్ సభ్యుడు. చివరిసారిగా 2024 టి-20 వరల్డ్‌కప్‌లో ఆసీస్ తరఫున ఆడాడు.
అయితే తన రిటైర్‌మెంట్ గురించి ఓ విషయంలో చాలా చింతిస్తున్నానని స్టార్క్ (Mitchell Starc) వెల్లడించాడు. తన రిటైర్‌మెంట్ విషయం కెప్టెన్ మిచెల్ మార్ష్‌కు చెప్పడం మర్చిపోయానని అతడు అన్నాడు. ‘‘టి-20 ఫార్మాట్‌లో నేను రిటైర్‌మెంట్ ప్రకటించే విషయాన్ని హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్, నా తోటి బౌలర్లు పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్‌తో చర్చించాను. కానీ, ఆస్ట్రేలియా టి-20 కెప్టెన్ మిచెల్ మార్ష్‌కు సమాచారం అందించలేదు. నేను ఆ విషయాన్ని అతడిని చెప్పుండాల్సింది. అతడు ఇన్‌స్టా చూసి నా రిటైర్‌మెంట్ గురించి తెలుసుకున్నాడు. ఆ విషయాన్ని నాకు మెసేజ్ చేశాడు. నేను ఈ విషయమై చింతిస్తున్నాను. నేను కెప్టెన్‌కి ఓ మాట చెప్పాల్సింది. నన్ను మన్నించు మిచెల్ మార్ష్’’ అంటూ స్టార్క్ ఆవేదన వ్యక్తం చేశాడు.
Also Read : రిటైర్‌మెంట్ తర్వాత కీలక వ్యాఖ్యలు చేసిన అమిత్ మిశ్రా