Tuesday, September 2, 2025

దీపావళికి ‘మిత్ర మండలి’

- Advertisement -
- Advertisement -

ప్రేక్షకులు థియేటర్లలో నవ్వులతో నిండిన దీపావళి పండుగను జరుపుకునేలా.. ‘మిత్ర మండలి’ చిత్రాన్ని అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఆకట్టుకునే విడుదల తేదీ పోస్టర్‌తో పాటు ఒక వినోదభరితమైన ప్రకటన వీడియోను నిర్మాతలు ఆవిష్కరించారు. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ స్థాపించిన నిర్మాణ సంస్థ బి.వి. వర్క్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మిత్ర మండలి’.

ఈ చిత్రం హాస్యం, రహస్యం, యవ్వన శక్తి మిశ్రమంగా ప్రేక్షకులకు అపరిమిత వినోదాన్ని అందించడానికి సిద్ధమవుతోంది. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం., విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read : మొదటి పాట వచ్చేస్తోంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News