మేషం – ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది.బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. రాజకీయాలరంగాలలోని వారికి కొంత అనుకూలంగా ఉంటుంది.
వృషభం – జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది.
మిథునం – వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. రాజకీయా రంగాలలోని వారు ప్రభుత్వం నుండి ఆహ్వానాలు అందుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు.
కర్కాటకం – నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుతారు. వివాదాలకు చాలా దూరంగా ఉండండి. సంతానం నుండి కీలక సమాచారం అందుతుంది. ఎంతటి కార్యాన్నైనా పట్టుదలతో సాధిస్తారు.
సింహం – దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు.గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి.
కన్య – దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. శుభవార్తలు వింటారు.
తుల – జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. మీ ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
వృశ్చికం – మీ ఉన్నతిని చూసి ఓర్వలేని వారు అధికంగా ఉంటారు.చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు.ఆదాయ వ్యయాలు సరి సమానంగా ఉంటాయి. రాజకీయాలపై దృష్టి సారిస్తారు.
ధనుస్సు – పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా నిదానంగా పూర్తిచేస్తారు.సంతానం చేపట్టిననూతన ప్రయత్నాలు ఫలిస్తాయి.
మకరం – నూతన పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి స్థితిగోచరిస్తుంది.ఆరోగ్యం వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు.
కుంభం – కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుంటారు..ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి.
మీనం – విలువైన వస్తువులు వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కళా రాజకీయ రంగాలలో వారికి ప్రభుత్వ పరంగా ఆహ్వానాలు అందుతాయి. క్రయక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు.