- Advertisement -
మియాపూర్: సంగారెడ్డి జిల్లా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం గోపాల్ నగర్ లో బైక్ ను స్కూల్ బస్సు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నాగరాజు అనే వ్యక్తి క్యాలిసియం ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నిషియన్ గా పని చేస్తున్నాడు. నాగరాజు బైక్ పై వెళ్తుండగా మూలమలుపు వద్ద వేగంగా గ్లోబల్ ఎడ్జ్ స్కూల్ కు చెందిన బస్సు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -