మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధి: పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల పై గురువారం (31న) సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. రాజకీ య వర్గాల్లో ఆసక్తికరంగా చర్చ జరుగుతున్నది.బిఆర్‌ఎస్ నుంచి గెలుపొందిన గూడెం మహిపాల్ రెడ్డి, కాలె యాదయ్య,బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాష్ గౌడ్, సం జయ్ కుమార్, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని సుప్రీం కోర్టులో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇలా ఉం డగా అంతకుముందు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, సుప్రీం కోర్టు గురువారం తీర్పు వెలువరించనున్నది. ‘
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలని లోగడ సుప్రీం కోర్టు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ప్రశ్నించింది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి తరఫున హాజరైన అడ్వకేట్ ముకుల్ రోహత్గిని కోర్టు నిలదీసింది.ఇదిలాఉండగా తొలుత బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కెవి వివేకానంద తమ పార్టీ తరఫున ఎన్నికై అధికార కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందిగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు గత ఏడాది నవంబర్ 22న తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్పీకర్‌కు సూచించింది.
హైకోర్టు తీర్పుపై సుప్రీంలో సవాల్
హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున అడ్వకేట్ శేషాద్రి నాయుడు వాదన వినిపిస్తూ బిఆర్‌ఎస్ నుంచి ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్యేలు మూడు నెలల్లోపే పార్టీ ఫిరాయించారని తెలిపారు. ఈ ఫిరాయింపుల గురించి స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు పిటిషనర్ ఫిర్యాదు చేయగా, పది న్లైనా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. దీంతో హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు ఏకసభ్య ధర్మాసనం మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించినట్లు పిటిషనర్ తరఫు అడ్వకేట్ తన వాదన వినిపించారు. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు గురువారం వెలువరించనున్నది.