Thursday, May 1, 2025

టిడిపిలో చేరికపై ఎమ్మెల్యే రాజా సింగ్ క్లారిటీ…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిడిపిలో చేరుతున్నారంటూ తనపై జరుగుతున్న ప్రచారాన్ని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. టిడిపిలోకి వెళ్లాలని కనీసం ఆలోచన కూడా చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తొలి ప్రాధాన్యత ఇచ్చేది హిందూ ధర్మానికేనని.. ధర్మం సేవ చేయాలనేదే తన ఉద్దేశమని, బిజెపి తప్ప తనలాంటి వ్యక్తులను ఏ పార్టీ తీసుకోదని రాజాసింగ్ వెల్లడించారు. తన ఆలోచనలు ఏ పార్టీతో సరిపోదన్నారు.

బిజెపి జాతీయ నాయకత్వం విధించిన సస్పెన్షన్ ఎప్పుడూ ఎత్తి వేస్తుందో తెలియదని రాజాసింగ్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు, బండి సంజయ్‌తో పాటు రాష్ట్ర నాయకత్వం అండగా ఉందన్నారు. గోషామహల్ నియోజకవర్గం నుంచే బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన తెలిపారు. బిజెపి నాయకులందరూ నా వెంట ఉంటూ.. భరోసానిస్తున్నారని ఆయన తెలిపారు.

ఎపిలో చంద్రబాబు గెలిచే అవకాశాలు..
చంద్రబాబు అంటే తనకు చాలా గౌరవమని.. రాజకీయంగా తనకు చంద్రబాబే జీవితం ఇచ్చారని ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లడించారు. గౌరవం ఉండటం వేరు.. రాజకీయాలు వేరని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రాలో టిడిపి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను. నా ఆలోచనలు బిజెపికి మాత్రమే సరిపోతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News