Thursday, September 4, 2025

హిందూ పండుగలు ఎలా జరుపుకోవాలో చెప్పడానికి మీరెవరు..?: రాజాసింగ్

- Advertisement -
- Advertisement -

హిందువుల పండుగలు ఏవిధంగా జరుపుకోవాలో చెప్పడానికి మీరెవరని పోలీస్ కమిషనర్, డీజీపీని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. మా పండుగలు ఎలా జరుపుకోవాలో మీరే చెబుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై ఎమ్మెల్యే రాజాసింగ్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైనా హిందూ పండుగ వస్తే పోలీసులు లెక్కలేనన్ని ఆంక్షలు విధిస్తున్నారని విమర్శించారు. డీజేలు పెట్టొద్దు, బ్యాండ్ పెట్టొద్దు అంటూ ఆంక్షలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గణేష్ ఉత్సవాలకు మున్సిపల్ శాఖ, జీహెచ్‌ఎంసీ అధికారులు ఎంతో సహకరిస్తారని పేర్కొంటూ వారికి ధన్యవాదాలు తెలిపారు. గణేష్ ఉత్సవ కమిటీ అధికారులు పోలీసుల ట్రాప్‌లో చిక్కుకోవద్దని అన్నారు. ఏడాదికి ఒక్క రోజు జరుపుకునే గణేష్ నిమజ్జనంలో డీజేలు, బ్యాండ్ పెడితే ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు డీజేలు పెట్టుకోవాలని, అయితే మంచి పాటలు పెట్టాలని సూచించారు. హనుమాన్ జయంతికి కూడా ఇలాంటి ఆంక్షలే విధిస్తారని గుర్తు చేస్తూ పోలీసులు సహకరించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News