Saturday, July 12, 2025

గోషామహల్‌కు ఉప ఎన్నిక తప్పదా?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేకప్రతినిధి : బిజెపి ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన రాజీనామాను పార్టీ నాయకత్వం ఆ మోదించింది. దీంతో రాజాసింగ్ ప్రాతినిథ్యం వ హిస్తున్న గోషామహల్ నియోజకవర్గానికి ఉప ఎ న్నిక అనివార్యం. పూర్వాపరాల్లోకి వెళితే.. బిజెపి అధ్యక్ష పదవిని ఆశించిన రాజాసింగ్ నామినేషన్ దాఖలు చేసేందుకు పార్టీ కార్యాలయానికి వెళ్ళడం, అక్కడ తన ముఖ్య అనుచరుల పట్ల దౌ ర్జన్యం జరిగిందని, దీంతో మనస్థాపానికి గురైన తాను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించారు. అంతేకాకుండా రాజీనామా లేఖను లిఖితపూర్వకంగా పార్టీ కార్యాలయానికి పంపించారు. అప్పుడు అ ధ్యక్షునిగా ఉన్న కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆ రాజీనామా లేఖను పార్టీ జాతీయ నాయకత్వానికి పంపించారు. కాగా పార్టీ జాతీయ అధ్యక్షు డు జెపి నడ్డా ఆయన రాజీనామాను ఆమోదించినట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఈ మేరకు లేఖను రాజాసింగ్‌కుపంపించారు.

దీంతో గోషామహల్ నియోజకవర్గానికి ఉ ప ఎన్నిక అనివార్యమా? అనే చర్చ ప్రారంభమైం ది. రాజ్యాంగంలోని పదవ షెడ్యూలు (పార్టీ ఫి రాయింపుల నిరోధక చట్టం) ప్రకారం ఎంపీ లే దా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్వచ్ఛందంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినా, ఆ రాజీనామాను పార్టీ నాయకత్వం ఆమోదించినా సద రు సభ్యుని సభ్యత్వం రద్దవుతుంది. అయితే చ ట్టంలో ఒక మెలిక ఉంది. పదవ షెడ్యూలులోని ఆరవ సెక్షన్ ప్రకారం సదరు సభ్యుని సభ్యత్వం రద్దును స్పీకర్/చైర్మన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు సదరు సభ్యుని పార్టీ అగ్ర నాయకత్వం స్పీకర్‌కు లేఖ రాయాల్సి ఉంటుంది. తమ సభ్యుడు పార్టీకి చేసిన రాజీనామాను ఆమోదించడం జరిగింది కాబట్టి మీరు ఆ సభ్యుని సభ్యత్వం విషయంలో తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ లేఖలో ఉండాలి.

పార్టీ నాయకత్వం నుంచి లేఖ రాని పక్షంలో అది పార్టీ అంతర్గత విషయంగానే ఉంటుంది. అలా లేఖ వచ్చిన తర్వాత కూడా సదరు సభ్యుని గుణగణాలను పరిగణలోకి తీసుకుని స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని పదవ షెడ్యూలులో స్పష్టంగా ఉంది. ఈ విషయంలో స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోకుండా సదరు సభ్యున్ని పిలిపించుకుని ముఖాముఖిగా మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.ఇప్పుడు రాజాసింగ్ రాజీనామా విషయంలోనూ ఏమి జరుగుతుందనేది సస్పెన్స్‌గానే ఉంది. ఎందుకంటే రాజాసింగ్ పార్టీకి చేసిన రాజీనామాను పార్టీ జాతీయ నాయకత్వం ఆమోదించింది. రాజాసింగ్ రాజీనామాను ఆమోదించినట్లు పార్టీ నాయకత్వం స్పీకర్‌కు లేఖ పంపిస్తుందా? లేదా? అనే స్పష్టత లేదు.రాజాసింగ్ తమ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయాన్ని బిజెపి జాతీయ నాయకత్వం స్పీకర్‌కు లేఖ ద్వారా తెలిపితే ఉప ఎన్నిక జరుగుతుందన్న చర్చ పార్టీలో జరుగుతున్నది. గోషామహల్‌లో తనకు పట్టు ఉందన్న ధీమా ఉంది కాబట్టే రాజాసింగ్ రాజీనామా చేసి ఉంటారని కొందరు, సెంటిమెంట్ ద్వారా తిరిగి గెలుపొందుతారని మరి కొందరు అంటున్నారు. శివ సేన పార్టీకి రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు తీసుకుంటారన్న ప్రచారం ఆయన రాజీనామా చేసినప్పటి నుంచే ఉంది.

అమర్‌నాథ్ యాత్రలో రాజా సింగ్
ఇదిలాఉండగా రాజీనామాను పార్టీ జాతీయ నాయకత్వం ఆమోదించడంపై రాజా సింగ్ అభిప్రాయం తెలుసుకోవడానికి ప్రయత్నించగా, ఆయన ఫోన్‌లో స్పందించలేదు. రాజాసింగ్ అమర్‌నాథ్ యాత్రలో ఉన్నట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News