Tuesday, July 29, 2025

రాజకీయ లబ్దికోసమే బిఆర్‌ఎస్ దుష్పచారాలు: ఎమ్మెల్యే సత్యనారాయణరావు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/భాపాలపల్లి జల్లా ప్రతినిధి: రాష్రాన్ని పది సంవత్సరాలు పాలించి అప్పులకుప్పగా చేసి, అక్రమ సంపాదనను కూడబెట్టుకొని, రాజకీయ లబ్దికోసం కాంగ్రెస్ పై బీఆర్‌ఎస్ నాయకులు దుష్పచారం చేస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి పర్యటనలో కెటిఆర్, మాజీ ఎమ్మేల్యే వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ పార్టీపై చేసిన వాఖ్యలను ఖండిస్తూ సోమవారం ఎమ్మెల్యే విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. కెసీఆర్ కుటుంబానికి తుపాకి రామునికి కంటె మిన్నగా మాట్లాడడం అలవాటని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండడం ఓర్వలేక దిగజారిన మాటలు మాట్లాడుతన్నారని తెలిపారు. 1200 వందల మంది బలిదానాల చూడలేక సోనియమ్మ తెలంగాణ ఇచ్చిందని అన్నారు. కులగణన చేపట్టి, అసెంబ్లీలో బిసి రిజర్వేషన్ బిల్లు పెట్టి గవర్నర్‌కు ఆమోదం కోసం పంపిన ఘనత రేవంతరెడ్డి ప్రభుత్వానిదని పేర్కొన్నారు. భూపాలపల్లి బీఆర్‌ఎస్‌నాయకులకు శీల పరీక్షలు చేసుకునే దుస్థితి నెలకొందని అన్నారు. భూపాలపల్లికి ఒక్క చుక్క నీరురాకున్నా కాళేశ్వరం ప్రాజెక్టు తూములు ప్రారంభించాలని దీక్ష చేస్తామనడం విడ్డూరమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ బాంబులు పెట్టి కూల్చిందని అనడం సిగ్గుచేటని అన్నారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం కంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ఆగం చేశారని అందుమూలాన నిర్మాణ పనులు చేపట్టేందుకు కంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ,10 ఏండ్లు పాలించి బీఆర్‌ఎస్ నాయకుడు ఇసుకందాలు చేసింది ప్రజలు గమనించారని అన్నారు. రోడ్లు, ప్రభుత్వ భవనాలు, ఆలయాలకోసం, ఆసుపత్రిల సౌకర్యాలకోసం, విద్యాలయాల నిర్మాణం కోసం నియోజకవర్గానికి 500 కోట్లు తెచ్చామని, నాపదవికాలంలో అన్నిపనులు పూర్థిచేస్తానని లేనియెడల ఓట్లు అడగమని అన్నారు. సమస్యలే నా ఎజెండాగా, నియోజకవర్గ అభివద్ధికోసం కృషి చేస్తానని తెలిపారు. ఈకార్యక్రమంలో చల్లూరి మధు, పిప్పాల రాజేందర్, సాంబారావు, సంపత్, దాట్ల శ్రీనివాస్,ముంజాల రవీందర్, రత్నం సమ్మిరెడ్డి, అప్పం కిషన్, పద్మలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News