Wednesday, July 9, 2025

డికె.. సిఎం కావడం ఖాయం: ఎమ్మెల్యే యోగేశ్వర్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఉండదని చెప్పినా ఉత్కంఠ కొనసాగుతోంది. ఐదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ఓవైపు సిద్ధరామయ్య చెబుతున్నా, అక్కడి పరిస్థితులు మాత్రం ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. సీఏం పదవిని ఆశించడంలో తప్పులేదు కదా అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బహిరంగంగా తన కోర్కెను వెల్లడించడంతో సీఎం మార్పు అంశం తార స్థాయికి వెళ్లింది. తాజాగా డీకేకు అనుకూలంగా ఎమ్మెల్యే సీసీ యోగేశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ లోని మెజార్టీ ఎమ్‌ఎల్‌ఎల మద్దతు , ప్రజల మద్దతు ఆయనకే ఉందని చెప్పారు. “చాలా మంది ఎమ్మేల్యేలు ఒకే మాటపై ఉన్నారు. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావడం ఖాయం.

ఇది కేవలం నా ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదు. పలువురు ఎమ్‌ఎల్‌ఏలు , ప్రజలు ఇదే కోరుకుంటున్నారు” అని మంగళవారం యోగేశ్వర్ అన్నారు. అయితే నిర్ణయం మాత్రం అధిష్టానం చేతిలో ఉందని చెప్పారు. డీకేకు 100 మంది ఎమ్‌ఎల్‌ఏల మద్దతు ఉందని మరోనేత చెప్పుకొచ్చారు. సీఎం మార్పు సిద్దరామయ్య , డీకే శివకుమార్ వర్గాల మధ్య తీవ్ర అంశంగా మారిన నేపథ్యంలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రణదీప్ సూర్జేవాలా ఇటీవల వారిద్దరితో సంప్రదింపులు జరిపిన సంగతి తెలిసిందే. అనంతరం రాష్ట్రంలో నాయకత్వ మార్పు లేదని ఆయన ప్రకటించారు. ఆ తర్వాత సోమవారం డీకే సిఎం పదవిని ఆశించడంలో తప్పులేదు కదా అని తన కోరికను పరోక్షంగా బయటపెట్టారు. ఈ తరుణంలో ఆయనకు మద్దతు ఇస్తూ ఎమ్‌ఎల్‌ఎలు ప్రకటనలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News