- Advertisement -
తెలంగాణ సెంటిమెంట్‌ను మరోసారి రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్న బిఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎలా పదవుల్లో కొనసాగుతారని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారని ఆయన సందేహాన్ని వ్యక్తం చేశారు. కుటుంబంలోని వివాదాన్నే పరిష్కరించుకోలేనప్పుడు రాష్ట్రాన్ని ఏ విధంగా పాలిస్తారని ఆయన ప్రశ్నించారు.
- Advertisement -