Friday, June 13, 2025

కాంగ్రెస్ లేకపోతే కెసిఆర్ ఫ్యామిలీకి పుట్టుగతులు లేవు: అద్దంకి దయాకర్

- Advertisement -
- Advertisement -

అసలు కాంగ్రెస్ పార్టీ లేకపోతే కెసిఆర్ ఫ్యామిలీకి పుట్టుగతులు కూడా లేవని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆంకాంక్షను నెరవేరుస్తూ ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. అసలు బిఆర్‌ఎస్ పార్టీకి భవిష్యత్‌ను ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే నాడు కాంగ్రెస్‌లో బిఆర్‌ఎస్‌ను విలీనం చేస్తామని చెప్పి దొంగ ప్రకటనలు చేశారని ఆయన ఆరోపించారు.

లిక్కర్ స్కాంలో కవిత, ఫార్ములా ఈ రేసు కేసులో కెటిఆర్, కాళేశ్వరం ఉచ్చులో చిక్కుకొని కెసిఆర్ కొట్టుమిట్టాడుతున్నాని ఆయన ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల కుటుంబం పూర్తిగా అవినీతిమయం అయ్యిందని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ గురించి ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడితే ప్రజలు అంత ఆలోచన లేకుండా లేరని సరైన సమయంలో బిఆర్‌ఎస్ పార్టీకి బుద్ధి చెబుతారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News