రాహుల్‌గాంధీని విమర్శించే అర్హత రఘనందన్ రావుకు లేదని, బిఆర్‌ఎస్ సహకారంతో ఎంపి గెలిచి హరీష్‌రావుతో ఒప్పందం చేసుకొని రఘనందన్ రావు మెదక్ ఎంపి అయ్యారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఓ ప్రకటనలో ఆరోపించారు. నక్కకు నాగలోకానికి ఉన్న తేడా రఘనందన్ రావు, రాహుల్ గాంధీకి ఉందని ఆయన అన్నారు. పెద్ద వాళ్లపైన మాట్లాడితే పెద్ద వాడివి అయిపోతానని రఘనందన్ రావు అనుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రఘనందన్ రావుకు అంత సీన్ లేదని, రఘనందన్ రావుకు బిజెపిలో అంత బేస్ లేదని ఆయన అన్నారు.
రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము రఘనందన్ రావుకు లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నిస్తుంటే రఘనందన్ రావు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ఆయన ప్రశ్నించారు. చనిపోయిన వాళ్లతో టి తాగే అద్భుత అవకాశం ఈసీ రాహుల్ గాంధీకి ఇచ్చిందని, చనిపోయిన వాళ్లు ఏకంగా సుప్రీంకోర్టులో ప్రత్యక్షమవుతున్నారని రాహుల్ గాంధీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఈసీ నీళ్లు మింగుతోందని వారి బండారం బయటపడుతుందన్న భయంతో బిజెపి నాయకులున్నారని ఆయన అన్నారు. మీరెంత మాట్లాడినా ఉపయోగం లేదని, మీ కథను మా రాహుల్ గాంధీ ముగిస్తారని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు.