Tuesday, July 22, 2025

మాగంటి గోపీనాథ్‌ కోలుకుంటున్నారు: దాసోజు శ్రవణ్‌

- Advertisement -
- Advertisement -

జూబ్లీహిల్స్‌ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ కోలుకుంటున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ అన్నారు. గురువారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గోపీనాథ్ ను కుటుంబ సభ్యులు నగరంలోని ఏఐజి ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమించడంతో ఐసియులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ నేతలు ఏఐజి ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్ రావు ఆస్పత్రికి వెళ్లి మాగంటి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో మాట్లాడారు. తర్వాత ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కెపి వివేకానంద, ముఠాగోపాల్‌, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ పలువురు బిఆర్ఎస్ నాయకులు ఆస్పత్రికి ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ వైద్యానికి స్పందిస్తున్నారని తెలిపారు. 48గంటల పాటు ఆయనను డాక్టర్లు అబ్జర్వేషన్‌లో ఉంచారని చెప్పారు.సర్దార్‌ ఆత్మహత్య ఘటనతో ఆయన ఒత్తిడికి గురయ్యారని శ్రవణ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News