Sunday, August 3, 2025

నా మీద నీచంగా మాట్లాడతారా? ఇదేనా రాజకీయం : కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జగదీష్ రెడ్డి వ్యాఖ్యల వెనుక బిఆర్ఎస్ లోని కీలక నేత ఉన్నారని ఎమ్మెల్సీ కవిత (MLC kavitha) అనుమానం వ్యక్తం చేశారు. నల్లగొండలో బిఆర్ఎస్ ను నాశనం చేసిందే జగదీష్ రెడ్డి అని అన్నారు. తన మీద నీచంగా మాట్లాడతారా? ఇదేనా రాజకీయం అని మండిపడ్డారు. ఇంటి ఆడబిడ్డపై వ్యాఖ్యలు చేస్తే బిఆర్ఎస్ సోదురులు మాట్లాడలేదని, నల్గొండ జిల్లాలో ఎక్కువ సీట్ల ఓటమికి కారణమైన వ్యక్తి తనపై మాట్లాడతారా అని ప్రశ్నించారు. జిల్లాలో సీట్ల ఓటమికి కారణమైన లిల్లీపుట్ నేత తన గురించి మాట్లాడతారా? అని మాజీ సిఎం కెసిఆర్ లేకుంటే ఆ లిల్లీపుట్ ఎవరు? అని నిలదీశారు. తన తండ్రి కెసిఆర్ కు రాసిన లేఖ బయటకు లీక్ చేసింది ఎవరు? అని సి.ఎం. రమేష్ ఎందుకు మాట్లాడారో తనకు తెలియదని అన్నారు. సి.ఎం రమేష్ తనకు తెలుసు కానీ గత ఆరు నెలల్లో ఎప్పుడూ మాట్లాడలేదని తెలియజేశారు. ప్రభుత్వం, కోర్టు అనుమతి లేకుంటే ఇంటి నుంచే దీక్ష చేస్తానని కవిత సవాల్ విసిరారు. మ్యాచ్ ఫిక్సింగ్ చేసే వారే తన వెనుక ప్రభుత్వం ఉంది అంటే ఎలా? అని కవిత ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News